బెంగళూర్ : హింసతో ఈశాన్య రాష్ట్రం భగ్గుమంటుండగా ప్రధాని నరేంద్ర మోదీ కర్నాటక ఎన్నికల ప్రచారంలో ( Karnataka Assembly Elections) బిజీగా ఉన్నారని చత్తీస్ఘఢ్ సీఎం భూపేష్ బాఘేల్ విమర్శించారు. మణిపూర్ అల్లర్లను బాఘేల్ ప్రస్తావిస్తూ ఈశాన్య రాష్ట్రంలో అలజడి రేగి సైనికులు మరణిస్తుంటే పరిస్ధితి చక్కదిద్దాల్సిన కాషాయ పాలకులు కర్నాటకలో ఓట్ల వేట సాగిస్తున్నారని దుయ్యబట్టారు.
కర్నాటక ప్రజలకు మేలు చేసేందుకు తామేం చేస్తామో బీజేపీ నేతలు వెల్లడించడం లేదని, వారు కేవలం ప్రచార ఆర్భాటంతో ఓట్ల కోసం షో చేస్తున్నారని ఆరోపించారు. ఇక కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీల అగ్రనేతలు రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు.
ర్యాలీలు, మెగా రోడ్‌షోలు, భారీ బహిరంగ సభలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కర్నాటకలో పాగా వేసేందుకు కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్‌లు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇక మే 10న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
Read More
Encounter | తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి