పాట్నా, మే 15: భోజ్‌పురి సూపర్ స్టార్ పవన్ సింగ్ తల్లి ప్రతిమా దేవి బీహార్‌లోని కారాకాట్ లోక్‌సభకు మంగళవారం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. బీజేపీ సభ్యుడైన తన కుమారుడు పోటీ నుంచి తప్పుకునే అవకాశాలు ఉండటంతో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారని కొందరంటుండగా, కొడుకుతో ఢీకొనేందుకే ఆమె పోటీ చేస్తున్నారని మరికొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే తల్లీ కొడుకులిద్దరూ బరిలో ఉంటే ఎన్నికలు రసవత్తరంగా జరిగే అవకాశాలున్నాయి. కాగా, ఈ ఎన్నికల్లో బెంగాల్‌లోని అసన్సోల్ బీజేపీ టికెట్‌ను తిరస్కరించిన పవన్ సింగ్ తన సొంత రాష్ట్రమైన బీహార్‌లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించి నామినేషన్ వేశారు.