‘మహా’ ఎన్కౌంటర్ మృతుల గుర్తింపు
Gadchiroli Encounter | మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా ధనోరా తాలుకాలోని గ్యార్‌పట్టి అడవుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో మృతిచెందిన కొందరు నక్సల్స్ ని పోలీసులు గుర్తించారు. గ్యార్‌పట్టి పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవుల్లో శనివారం జరిగిన

మృతుల్లో ముఖ్యనాయకులు, ఆరుగురు మహిళలు
కొత్తగూడెం క్రైం: మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా ధనోరా తాలుకాలోని గ్యార్‌పట్టి అడవుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో మృతిచెందిన కొందరు నక్సల్స్ ని పోలీసులు గుర్తించారు. గ్యార్‌పట్టి పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవుల్లో శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందిన కొందరి వివరాలను పోలీస్ అధికారులు ఆదివారం వెల్లడించారు. ఆరుగురు మహిళలు సహా 26మంది మావోయిస్టులు ఈ ఎన్కౌంటర్లో మృతి చెందారు.
కాగా మృతుల్లో సెంట్రల్ కమిటీ సభ్యుడు మిలింద్ తేల్తుంబ్డే అలియాస్ దీపక్, డీవీసీఎం మహేష్ గోటా, డీవీసీఎం లోకేష్ మడకం, మిలింద్ బాడీగార్డులు కిషన్, భగత్ లు మృతిచెందిన మావోయిస్టుల్లో ఉన్నట్లు పోలీస్ అధికారులు పేర్కొన్నారు.
సంఘటనా స్థలం నుంచి 26 మంది మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఆరు ఏకే-47లు, తొమ్మిది ఎస్ఎల్ఆర్లు, ఒక ఇన్సాస్ రైఫిల్, మూడు 303రైఫిళ్లు, ఒక పిస్తోల్, తొమ్మిది 12బోర్ రైఫిళ్లను సీ-60 కమాండోలు స్వాధీనపరుచుకున్నారు. మరికొందరు మృతుల వివరాలను అధికారులు ద్రువపరచాల్సి ఉంది. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన వివరాలను గడ్చిరోలి ఎస్పీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు మీడియాకు వెల్లడించనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

