కోల్‌కతా: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ భవితవ్యం మరికొద్దిసేపట్లో తేలనుంది. బెంగాల్లో భవానీపూర్, జంగీపుర్, సంషేర్‌గంజ్ అసెంబ్లీ స్థానాలకు సెప్టెంబర్ 30 ఉపఎన్నికలు జరిగాయి. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. సీఎం దీదీ భవానీపూర్ నుంచి పోటీ చేశారు. ఆమెపై న్యాయవాది ప్రియాంక టిబ్రివాల్‌ను బీజేపీ బరిలోకి దింపింది. మొత్తం 21 రౌండ్లలో ఓట్లను లెక్కించనున్నారు.
ఈ ఏడాది ఆరంభంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మమత నందిగ్రామ్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. అయినప్పటికీ ఆమె నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో సీఎంగా ఆమె బాధ్యతలు చేపట్టారు. పదవి చేపట్టిన ఆరు నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నికవల్సి ఉంది. ఈ నేపథ్యంలో భవానీపూర్ నియోజకవర్గానికి ఉపఎన్నికలు తప్పనిసరి అయ్యాయి.