న్యూఢిల్లీ, జూన్ 20: లోక్సభ ప్రొటెం స్పీకర్గా భర్తృహరి మహతాబ్ను నియమించినట్టు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు గురువారం వెల్లడించారు. ఏడుసార్లు ఎంపీగా చేసిన మహతాబ్ ప్రస్తుతం బీజేపీ సభ్యునిగా కటక్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఆయనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రొటెం స్పీకర్గా నియమించినట్టు రిజిజు చెప్పారు. కొత్త ఎంపీలు ప్రొటెం స్పీకర్ ముందు ప్రమాణ స్వీకారం చేస్తారు. లోక్సభ తొలి సమావేశాలు జూన్ 24న ప్రారంభం కానుండగా, 24, 25 తేదీల్లో సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. 26న లోక్సభ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది.