న్యూఢిల్లీ : భారత్‌లో 2023 నవంబర్ నుంచి రేబిస్ వ్యాక్సిన్ అభయ్రాబ్కు చెందిన నకిలీ బ్యాచ్‌లు పంపిణీలో ఉన్నాయని ఆస్ట్రేలియా శుక్రవారం ఆరోగ్య హెచ్చరికలు జారీచేసింది. ఆనాటి నుంచి ఆ టీకా తీసుకున్న ప్రజలు రేబిస్ నుంచి పూర్తి సురక్షితంగా లేరని ఇమ్యునైజేషన్‌పై ఆస్ట్రేలియన్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూపు(ఏటీఏజీఐ) ఓ ప్రకటనలో తెలిపింది.
అభయ్రాబ్ని ఆస్ట్రేలియాలో ఉపయోగించనందు వల్ల భారత్‌లో రేబిస్ వ్యాక్సిన్ తీసుకున్న ఆస్ట్రేలియన్ పర్యాటకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గ్రూపు హెచ్చరించింది.