PM Modi: డీజిల్, పెట్రోల్‌పై ఇంధన కంపెనీలకు 75 వేల కోట్ల నష్టం: ప్రధాని మోదీ
PM Modi: పశ్చిమాసియా సంక్షోభ వేళ.. ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో.. వివిధ ఇంధన కంపెనీలు డీజిల్, పెట్రోల్‌పై సుమారు 75 వేల కోట్ల నష్టాన్ని చవిచూశాయని ప్రధాని మోదీ అన్నారు. ఆ నష్టాన్ని ప్రభుత్వమే భరించిందన్నారు. విపక్షాలు భయాందోళనలు క్రియేట్ చేశాయన్నారు. 40 దేశాల నుంచి ఇంధన దిగుమతి జరిగిందన్నారు.
బలోత్రా: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే ఆ అంశంపై విపక్షాలు ప్రజల్ని భయాందోళలనలకు గురి చేశాయని, ప్రజల్ని తప్పుదోవ పట్టించారని ప్రధాని మోదీ(PM Modi) అన్నారు. రాజకీయ క్రీడలు ఆడారని విమర్శించారు. కానీ చెడు ప్రయత్నాలు చేసిన వాళ్లు సక్సెస్ కాలేదన్నారు. చిన్న చిన్న అవరోధాలు తప్ప, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇంధన సరఫరాలో పెద్దగా సవాళ్లు ఎదురు కాలేదని మోదీ అన్నారు. ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో.. వివిధ ఇంధన కంపెనీలు డీజిల్, పెట్రోల్‌పై సుమారు 75 వేల కోట్ల నష్టాన్ని చవిచూశాయని అన్నారు. అయితే ఆ నష్టాన్ని ప్రభుత్వమే భరించిందన్నారు. లీటరుపై ఎక్సైజ్ సుంకాన్ని రూ.10 తగ్గించినట్లు మోదీ తెలిపారు. ప్రజలపై ఎటువంటి అదనపు భారం పడకుండా చూశామన్నారు. ఇవాళ రాజస్థాన్‌లోని బలోత్రాలో పెట్రోకెమికల్ రిఫైరీని ప్రారంభించిన తర్వాత మోదీ ప్రసంగించారు.
#WATCH | Balotra, Rajasthan | On fuel shortages in India amid the West Asia conflict, Prime Minister Narendra Modi says, “Attempts were made to frighten and mislead people. Political games were played. Yet, those with malicious intent did not succeed. Even in remote areas, apart… pic.twitter.com/d9NRkghQ3V
— ANI (@ANI) July 4, 2026
పశ్చిమాసియా యుద్ధ సమయంలో..వివిధ దేశాలతో ఉన్న స్నేహసంబంధాలు భారత్‌కు కలిసి వచ్చినట్లు ప్రధాని మోదీ తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభానికి ముందు కేవలం 26 దేశాల నుంచి మాత్రమే భారత్ ఇంధనాన్ని దిగుమతి చేసుకునేదని, కానీ సంక్షోభ సమయంలో భారత్ తన దౌత్య బలాన్ని ప్రదర్శించిందని, వార్ జరుగుతున్నా.. సుమారు 40 దేశాల నుంచి భారత్ ఇంధనాన్ని దిగుమతి చేసుకున్నట్లు చెప్పారు. దేశ ప్రయోజనాలు, ప్రజల సంక్షేమమే కీలకమన్న విషయాన్ని ప్రభుత్వం చాటి చెప్పిందన్నారు. తీవ్రమైన ఇంధన సంక్షోభం ఉన్నా.. అమితమైన అనుభవం వల్ల ఆ సంక్షోభం నుంచి బయటపడినట్లు ఆయన చెప్పారు.గత దశాబ్ధ కాలం నుంచి విజయవంతమైన విధానాల అమలు ద్వారా ఆ సంక్షోభ పరిస్థితి నుంచి గట్టెక్కినట్లు ఆయన తెలిపారు.
VIDEO | Balotra, Rajasthan: PM Modi (@narendramodi) says, “Rumours were spread during energy crisis, people were incited, but those with malicious intentions did not succeed… India’s diplomacy and friendships with other nations proved very useful.”
(Source: Third Party)
(Full… pic.twitter.com/jsEJ4rrsmh
— Press Trust of India (@PTI_News) July 4, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Diesel
- Oil Companies
- Petrol
- Pm Modi
RELATED ARTICLES
తాజా వార్తలు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
Punjab | డ్రగ్స్ వ్యతిరేక కార్యకర్త హత్య కేసు.. నిందితుడి ఇల్లు కూల్చివేత.. షాపు దహనం
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
Soma Bharat Kumar | హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

