Rameshwaram Cafe | బెంగళూరు, మార్చి 9: బెంగళూరులో మార్చి 1న బాంబు పేలుడు జరిగిన రామేశ్వరం కేఫ్‌ను శనివారం మళ్లీ తెరిచారు. పేలుడు జరిగిన ఎనిమిది రోజుల్లోనే మరమ్మతులు పూర్తి చేసి కేఫ్‌ను ప్రారంభించింది యాజమాన్యం. జాతీయ గీతం ఆలపించి కేఫ్‌ను ప్రారంభించి జాతీయ స్ఫూర్తిని చాటుకుంది.
కేఫ్‌లో మరోసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను బలోపేతం చేశామని యజమాని రాఘవేంద్రరావు తెలిపారు. తమ సెక్యూరిటీ సిబ్బందికి విశ్రాంత సైనికులతో శిక్షణ కూడా ఇప్పించనున్నట్టు చెప్పారు. పేలుడుకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ మొత్తం దర్యాప్తు సంస్థలకు అందించామని తెలిపారు. పోలీసులు కూడా రామేశ్వరం కేఫ్ వద్ద భద్రత ఏర్పాటు చేశారు.