ఈ నగరానికి ఎంత కష్టం..: ట్రాఫిక్ కడగండ్లతో బెంగళూర్ ఎకానమీకి రూ. 20,000 కోట్ల నష్టం
ట్రాఫిక్ పద్మవ్యూహంతో గంటల తరబడి వాహనదారులు రోడ్లపైనే బారులుతీరే దృశ్యాలు ఏండ్ల తరబడి బెంగళూర్‌లో కనిపిస్తూనే ఉన్నాయి. ట్రాఫిక్ చిక్కుల కారణంగా బెంగళూర్ ఆర్ధిక వ్యవస్ధకు దాదాపు రూ. 20,000 కోట్ల నష్టం వాటిల్లుతోందని తాజా అధ్యయనం వెల్లడించింది.
బెంగళూర్ : ట్రాఫిక్ పద్మవ్యూహంతో గంటల తరబడి వాహనదారులు రోడ్లపైనే బారులుతీరే దృశ్యాలు ఏండ్ల తరబడి బెంగళూర్‌లో కనిపిస్తూనే ఉన్నాయి. ట్రాఫిక్ చిక్కుల కారణంగా బెంగళూర్ ఆర్ధిక వ్యవస్ధకు దాదాపు రూ. 20,000 కోట్ల నష్టం వాటిల్లుతోందని తాజా అధ్యయనం వెల్లడించింది. సిటీ ప్లానింగ్, మౌలిక వసతులు మెరుగ్గా ఉన్నప్పటికీ ట్రాఫిక్ ఇబ్బందుల ఫలితంగా బెంగళూర్‌కు వేల కోట్ల నష్టం ఎదురవుతున్నదని ఈ అధ్యయనం పేర్కొంది. ఈ సర్వే బెంగళూర్‌లో రోడ్ ప్లానింగ్, ఫ్లైఓవర్లు, ట్రాఫిక్ మేనేజ్మెంట్, మౌలిక వసతుల్లో లోటుపాట్ల ఆధారంగా ఈ అంచనాకు వచ్చింది.
ట్రాఫిక్ కడగండ్ల కారణంగా బెంగళూర్ ఆర్ధిక వ్యవస్ధపై ప్రభావాన్ని అధ్యయనం విశ్లేషించింది. నగర ఉత్పాదకత, ఆర్ధిక వృద్ధికి ట్రాఫిక్ కష్టాలు అవరోధంగా మారాయని ఈ సర్వే తేల్చింది. బెంగళూర్ ఆర్ధిక వ్యవస్ధకు వెన్నుదన్నుగా నిలిచే ఐటీ పరిశ్రమపై ఇది అత్యధిక ప్రభావం చూపుతోంది. టెకీలు, ఐటీ ఉద్యోగులు గంటల కొద్దీ నగర రోడ్లపై చిక్కుకుపోవడంతో అది ఉత్పాదకతపై ప్రభావం చూపుతోంది. ట్రాఫిక్ ఇబ్బందులతో కేవలం ఐటీ రంగంలోనే రూ. 7000 కోట్ల నష్టం వాటిల్లుతోంది. ఎంఎస్ఎంఈల రంగానికి ట్రాఫిక్ ఇబ్బందుల కారణంగా రూ. 3500 కోట్ల నష్టం వాటిల్లుతోంది.
ఎకానమీకి నష్టం కలిగించడంతో పాటు ట్రాఫిక్ సమస్యతో వాహనాల నుంచి వెలువడే వాయువులు నగర పర్యావరణంపై పెను ప్రభావం చూపడంతో పాటు కాలుష్యం పెరుగుతున్నది. నగరంలో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు సమగ్రమైన పరిష్కారాలు, ప్రణాళికలు అవసరమని అధ్యయనం పేర్కొంది. ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించకుంటే అది నగర ఆర్ధిక వ్యవస్ధను దెబ్బతీయడంతో పాటు పౌరుల జీవన ప్రమాణాలపైనా ప్రతికూల ప్రభావం చూపుతుందని అధ్యయనం స్పష్టం చేసింది.
Read More :
Mahaveerudu Movie | అప్పుడే ఓటీటీలోకి మహావీరుడు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bengaluru
- economy
- loss
- traffic woes
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

