బెంగళూరు: ఒక మహిళ అందరిని ఆకట్టుకున్నది. భుజంపై చిలుకతో స్కూటర్ నడిపింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. (Woman Rides With Parrot) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. సాధారణంగా బెంగళూరు రోడ్లు వాహనాల రద్దీతో అస్తవ్యస్తంగా ఉంటాయి. నిత్యం కిలోమీటర్ల మేర నెలకొనే ట్రాఫిక్ జామ్‌లపై విమర్శలతోపాటు మీమ్స్ వైరల్ అవుతాయి.
కాగా, అలాంటి బెంగళూరులోని ఒక రహదారిలో ఒక మహిళ స్కూటర్ డ్రైవ్ చేసింది. ఆమె హెల్మెట్ ధరించలేదు. వెనుక మరో మహిళ కూడా కూర్చొన్నది. అయితే స్కూటర్ డ్రైవ్ చేసిన మహిళ భుజంపై రంగుల చిలుక ఉన్నది. అక్కడి స్థానికులను ఇది ఎంతో ఆకట్టుకున్నది.
మరోవైపు ఒకరు రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘బెంగళూరులో ఎప్పుడూ నిస్తేజమైన క్షణం కాదు. ఈ వీడియో క్లిప్‌ను చూడండి’ అని అందులో పేర్కొన్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. బెంగళూరు రోడ్డులో టెస్ట్ డ్రైవ్‌ను ఆ మహిళ పాస్ అయ్యిందని ఒకరు కామెంట్ చేశారు. అయితే ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదని, ఆమెకు జరిమానా విధించాలని మరికొందరు మండిపడ్డారు.
Never a dull moment in Bangalore pic.twitter.com/IzUr5nRaP8
— Rahul Jadhav (@iRahulJadhav) February 28, 2025