Bengaluru | బెంగళూరులో నీరు వృథా చేస్తే రూ.5 వేలు ఫైన్.. తాగు నీటి కోసం ప్రజల ఇబ్బందులు
కాంగ్రెస్ పాలిత కర్ణాటక రాజధాని బెంగళూరు నగరం తీవ్రమైన నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నది. తాగు నీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
- వాహనాలు కడిగేందుకు, నిర్మాణ పనులకు తాగునీటిని వాడొద్దు
- నగరవాసులకు జలమండలి హెచ్చరిక
Bengaluru | బెంగళూరు, మార్చి 8: కాంగ్రెస్ పాలిత కర్ణాటక రాజధాని బెంగళూరు నగరం తీవ్రమైన నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నది. తాగు నీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అటు నగర జలమండలి సరిపడా నీరు సరఫరా చేయకపోవడంతో పాటు మరోవైపు బోర్లు కూడా ఎండిపోతున్న నేపథ్యంలో ప్రజలు ట్యాంకర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితిని నెలకొన్నది. నీటి కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో బెంగళూరు నీటి సరఫరా బోర్డు తాజాగా కీలక నిర్ణయం తీసుకొన్నది. తాగునీటిని వృథా చేయొద్దని ప్రజలను కోరింది. ఉల్లంఘనకు పాల్పడితే రూ.5 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించింది.
సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని నీటిని అవసరాల మేరకు వినియోగించాలని సూచించింది. తాగునీటిని వాహనాలను తుడిచేందుకు, నిర్మాణం, వినోద కార్యకలాపాల్లో వాడొద్దని, అదేవిధంగా సినిమా హాళ్లు, మాల్స్‌లో తాగునీటి అవసరాల మినహా ఇతరత్రా కోసం వినియోగించవద్దని స్పష్టం చేసింది. ఉల్లంఘనకు పాల్పడిన వారిపై మొదటగా రూ.5 వేలు జరిమానా పడుతుందని, పదేపదే నీటి వృథాతో ఉల్లంఘనకు పాల్పడితే అదనంగా ప్రతిసారి రూ.500 చొప్పున ఫైన్‌గా చెల్లించాల్సి ఉంటుందని బెంగళూరు జలమండలి హెచ్చరించింది.
అవసరంలో సగం కూడా లేని సరఫరా
నగరంలో రోజుకు 2,600-2,800 ఎంఎల్డీ(మిలియన్ లీటర్స్ పర్ డే) నీటి అవసరం ఉంటే ఇప్పుడు దాదాపుగా 1,300 ఎంఎల్డీ నీరు మాత్రమే సరఫరా అవుతున్నది. అంటే, అవసరమైన నీటిలో సగం కూడా సరఫరా జరగడం లేదు. మరోవైపు ఎండాకాలం ఇంకా పూర్తిగా ప్రారంభం కాకముందే పరిస్థితి ఇలా ఉంటే.. రాబోవు రోజుల్లో పరిస్థితి ఇంకా ఎంత స్థాయికి దిగజారుతుందోనని నగరవాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ఒక్క బెంగళూరు మాత్రమే కాదు.. తుమకూరు, ఉత్తర కన్నడ జిల్లాల్లోని పలు ప్రాంతాలోనూ నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉన్నదని రెవెన్యూ శాఖ గుర్తించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JNTU | మహబూబాబాద్ జేఎన్టీయూలో అక్రమాలు.. హాస్టల్ డిపాజిట్ పర్సనల్ ఖాతాలోకి!
సాగునీటి వెతలు.. కరెంటు కోతలు.. కరువు కోరలు.. పంట చేతికొచ్చేనా..?
Kodangal | సీఎం ఇలాకాలో బలవంతపు భూ సేకరణ.. మనస్తాపంతో రైతు ఆత్మహత్యాయత్నం
Insurance Scam | శవాల మీది పేలాల మేత.. కార్మిక శాఖలో 150 కోట్ల స్కామ్
Revanth Reddy | చదువును వ్యాపారం చేయొద్దని అప్పుడు ఉపన్యాసాలు.. ఇప్పుడు కూతురితోనే కార్పొరేట్ స్కూల్.. సీఎం రేవంత్ తీరుపై క్రిశాంక్ ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

