న్యూఢిల్లీ : గతకాలం జ్ఞాపకాలు, బాల్య మధురస్మృతులు మనలో అందరినీ వెంటాడుతూనే ఉంటాయి. బెంగళూర్‌లోని ఓ సూపర్ మార్కెట్ ఈ భావోద్వేగాన్నే మార్కెటింగ్ మాయాజాలానికి ఎంచుకున్నా అందరినీ ఆకట్టుకునేలా మలిచింది. ఈ వినూత్న మార్కెటింగ్ ఐడియాను శరణ్య శెట్టి అనే ట్విట్టర్ యూజర్ సోషల్ మీడియా వేదికపై షేర్ చేసింది.
ఎంకే రిటైల్ ఏర్పాటు చేసిన నోస్టాల్జిక్ వాల్ ఫొటోను షేర్ చేసిన శరణ్య దీన్ని పీక్ బెంగళూర్ అంటూ రాసుకొచ్చారు. ఈ వాల్డిస్ప్లేలో మనం గతంలో వాడిన వింటేజ్ క్యాండీ రాపర్స్, గృహ వినియోగ బ్రాండ్ ప్యాకేజ్‌ల ఫొటోలు ఆకట్టుకున్నాయి. ఈ డిస్ప్లేలో గడిచిన రోజుల నాటి పామోలివ్ సోప్, లిప్టన్ టీ బ్యాగ్స్, కోల్గేట్ టూత్‌పేస్ట్, చిక్లెట్స్ గమ్ ప్యాకెట్స్ వంటివి పాతకాలపు రోజులను పట్టిఇస్తాయి. ఇది సూపర్ మార్కెట్ చేపట్టిన మార్కెటింగ్ ఐడియా అయినా మన గుండెల్లో అందమైన జ్ఞాపకాల తడి రేపుతుందని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు.
ఈ కలెక్షన్లో కిట్క్యాట్స్, స్నికర్స్, ఫాంటమ్ స్వీట్ సిగరెట్ క్యాండీస్, ట్విక్స్ బార్స్ వంటి అలనాటి ప్రోడక్ట్స్ కండ్లకు కట్టి మనల్ని కొద్దిసేపు ఆ రోజుల్లోకి తీసుకెళతాయి. ఈ ర్యాపర్స్ కేవలం ప్రోడక్ట్స్గానే మిగిలిపోవు..ఇవి నాటి ఎన్నో తరాల బాలల జ్ఞాపకాల పొరలకు సంకేతాలు. అప్పట్లో చిన్నారులు తాము దాచుకున్న పాకెట్ మనీతో వీటిని సొంతం చేసుకుని మురిసిపోయేవారు.
Read More :