బెంగళూరు: బెంగళూరులోని పీఈఎస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకరు తరగతి గదిలో ఓ ముస్లిం విద్యార్థిని పదే పదే ఉగ్రవాది అని సంబోధించారు. మార్చి 24న జరిగిన ఈ ఘటనను మరో విద్యార్థి తన సెల్‌ఫోన్ కెమెరాలో చిత్రీకరించాడు. ఆ వీడియో ప్రకారం ప్రొఫెసర్ మురళీధర్ దేశ్‌పాండే ఆ విద్యార్థిపై గట్టిగా కేకలు వేస్తూ ఉగ్రవాది అన్న పదాన్ని ఉపయోగించడం ఆ క్లిప్‌లో వినిపించింది. దీనిపై ఓ విద్యార్థి సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, మురళీధర్ని సస్పెండ్ చేస్తూ యూనివర్సిటీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.