బెంగళూరు ;ఆరు రోజుల కిందట బెంగళూరు-మైసూర్ ఎక్స్ప్రెస్వేను ప్రారంభించిన ప్రధాని మోదీ ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ప్రతిపక్షాలన్నీ మోదీని ఎలా అధికారంలో నుంచి దించాలని ఆలోచిస్తుంటాయని.. తాను మాత్రం బెంగళూరు-మైసూర్ ఎక్స్ప్రెస్వేను ఎలా అద్భుతంగా నిర్మించాలని ఆలోచిస్తుంటానని చెప్పారు. నిజమే మరి.. ఆయన ఆలోచించి అద్భుతంగా నిర్మించి, ప్రారంభించిన బెంగళూరు-మైసూర్ ఎక్స్ప్రెస్వే చిన్నపాటి వర్షానికే నీట మునిగింది. రహదారి అంతా వరద నీటితో నిండిపోయింది. దీంతో ప్రమాదాలు జరుగడమే కాకుండా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ‘ఆరు రోజులకే మాస్టర్ స్ట్రోక్’ అని నెటిజన్లు ప్రధాని మోదీని విమర్శిస్తున్నారు.