Face Mask | బెంగళూరు, సెప్టెంబర్ 1: మాస్క్ లేనిదే లోపలికి ప్రవేశం లేదు.. కొవిడ్ సమయంలో అన్ని షాపుల ముందు ఇలాంటి బోర్డులు కనిపించేవి. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. మాస్క్ ధరిస్తే నో ఎంట్రీ అంటూ దుకాణాలు బోర్డులు పెడుతున్నాయి. బెంగళూరులో పలు సూపర్మార్కెట్లు, షాపింగ్స్ మాల్స్ ఎదుట ఇలాంటి బోర్డులు దర్శనమిస్తున్నాయి.
ఇటీవలి కాలంలో దొంగతనాలు పెరగడమేనని దీనికి కారణమని చెప్తున్నారు. సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేసినప్పటికీ, చోరులు మాస్క్‌లు ధరిస్తుండటంతో వారిని గుర్తించలేకపోతున్నామని, అందుకే మాస్క్‌లతో వచ్చే వారిని అనుమతించడం లేదని కంగేరిలోని ఒక షాపింగ్ మాల్ యాజమాని తెలిపారు.
ఇలా మాస్క్‌లు ధరించి చిన్నచిన్న దొంగతనాలు చేసేవారిని పట్టుకోవడం కూడా కష్టమని ఒక పోలీస్ అధికారి చెప్పారు. ఇటీవల రామేశ్వరం కేఫ్‌లో జరిగిన బాంబు పేలుడులో కూడా నిందితుడు మాస్క్ ధరించే ఉన్నాడని, దొంగలకు ఇదొక యూనిఫాంగా మారిందని ఆయన పేర్కొన్నారు.