Suvendu Adhikari : పశ్చిమబెంగాల్ (West Bengal) ప్రజలు మమతా బెనర్జీ (Mamata Banerjee) ని తుడిచిపెట్టేస్తారని ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, బీజేపీ నేత సువేంధు అధికారి (Suvendu Adhikari) చెప్పారు. ఈ ఎన్నికల్లో సువేందు అధికారి.. మమతాబెనర్జి పోటీచేస్తున్నభవానీపూర్ (Babanipur), నంద్రిగ్రామ్ (Nandigram) రెండు నియోజకవర్గాల నుంచి బరిలో దిగారు. బెంగాల్ రెండు విడతల పోలింగ్‌లో భాగంగా ఇవాళ తొలివిడత పోలింగ్ జరుగుతోంది. ఈ నెల 29న రెండో విడత పోలింగ్ జరుగనుంది.
నందిగ్రామ్‌లో తొలి విడతలోనే పోలింగ్ జరుగుతోంది. సువేందు అధికారి ఓటు నందిగ్రామ్‌లో ఉండటంతో ఇవాళ ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇవాళ తాను పోలింగ్ కేంద్ర దగ్గరికి రాగానే ఓ వివాహిత మహిళ తనను సమీపించి ఏడ్చిందని, హిందువులను కాపాడాలని కోరిందని చెప్పారు. మళ్లీ మమతాబెనర్జి అధికారంలోకి వస్తే నంద్రిగ్రామ్ కూడా ముర్సీదాబాద్లా అవుతుందని ఆమె ఆందోళన వ్యక్తంచేశారు.
అదేవిధంగా తాను 65 నుంచి70 ఏళ్ల వయస్సున్న ఓ వృద్ధురాలిని ఓటు ఎవరికి వేస్తున్నావని పలుకరించానని, అందుకు ఆమె బదులిస్తూ మమతా బెనర్జీకి గుణపాఠం చెబుతానని అన్నారని సువేందుకు తెలిపారు. ఈ ఎన్నికల్లో బెంగాలీ ప్రజలు మమతాబెర్జీని తుడిచిపెట్టేస్తారని అన్నారు. మమత అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారని విమర్శించారు.