నా ప్రసంగాన్నే అడ్డుకుంటారా..
పశ్చిమబెంగాల్ ప్రతిపక్ష నేత, బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి సాక్షాత్తూ శాసనసభలోనే తమ పార్టీకి చెందిన నలుగురు రెబెల్ ఎమ్మెల్యేలను బెదిరించారు. మీపై ఐటీ దాడులు చేయిస్తానని హెచ్చరించారు. దీంతో ఆ నలుగురు ఎమ్మెల్యేలు స్పీకర్‌కు ఫిర్యాదు చేయడంతో సువేందుపై చర్యలు తీసుకునేలా సభ ప్రివిలేజ్ మోషన్ (సభాహక్కుల ఉల్లంఘన)ను ఆమోదించింది.
- ఐటీ దాడులు చేయిస్తా!
- ఎమ్మెల్యేలను బెదిరించిన
- బీజేపీ నేత సువేందు అధికారి
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ప్రతిపక్ష నేత, బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి సాక్షాత్తూ శాసనసభలోనే తమ పార్టీకి చెందిన నలుగురు రెబెల్ ఎమ్మెల్యేలను బెదిరించారు. మీపై ఐటీ దాడులు చేయిస్తానని హెచ్చరించారు. దీంతో ఆ నలుగురు ఎమ్మెల్యేలు స్పీకర్‌కు ఫిర్యాదు చేయడంతో సువేందుపై చర్యలు తీసుకునేలా సభ ప్రివిలేజ్ మోషన్ (సభాహక్కుల ఉల్లంఘన)ను ఆమోదించింది. ఇటీవల ప్రారంభమైన బడ్జెట్ సమావేశాల్లో సువేందు మాట్లాడుతుండగా ఈ నలుగురు రెబెల్ ఎమ్మెల్యేలు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీంతో కోపం వచ్చిన ఆయన సభ నుంచి బయటికి వెళ్తూ ఐటీ దాడులు చేయిస్తానని బెదిరించారంటూ ఆ నలుగురు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో సువేందుపై చర్యలు తీసుకునేలా గురువారం సభ ప్రివిలేజ్ మోషన్‌ను ఆమోదించింది. వెంటనే దీన్ని ప్రివిలేజ్ కమిటీకి పంపింది. ఆ కమిటీ పరిశీలించి నివేదిక సమర్పించగానే సువేందుపై చర్యలు తీసుకునే అవకాశముంది. స్పీకర్ బిమన్ బెనర్జీ మాట్లాడుతూ ‘సువేందుపై ఫిర్యాదు రాగానే రికార్డులను పరిశీలించాను. ఆయన తప్పు చేసినట్టు తెలుస్తున్నది. ఇది తీవ్రమైన నేరం లాంటిదే. కాబట్టి సభా నియమ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

