భువనేశ్వర్, డిసెంబర్ 18: ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ యాచకురాలు. తాను బిక్షాటన చేయగా వచ్చిన మొత్తం డబ్బును దేవుడికి విరాళంగా ఇచ్చింది. ఈమె పేరు తులా బెహరా. ఒడిశాలోని ఫుల్బని ప్రాంతంలో ఉన్న జగన్నాథ ఆలయం ముందు గత 20 ఏండ్లుగా బిక్షాటన చేస్తున్నది. ఇలా వచ్చిన డబ్బు మొత్తం రూ.లక్షను జగన్నాథుడికి విరాళంగా ఇచ్చింది.