Bear | రాజస్థాన్‌లోని హిల్ స్టేషన్ మౌంట్ అబు (Mount Abu)లో గల ఓ హోటల్‌కు రాత్రిపూట ఊహించని అతిథి వచ్చింది. తెల్లవారుజామున 2:55 గంటల ప్రాంతంలో అడవిలో నుంచి వచ్చిన ఎలుగుబంటి (Bear) హోటల్ రిసెష్షన్ ప్రాంతంలోకి ప్రవేశించింది. మెయిన్‌డోర్ తీసుకుని లాబీలోకి ఎంటర్ అయ్యింది. అనంతరం దాదాపు నాలుగు నిమిషాల పాటూ అక్కడ ఉన్న వస్తువులను నిశితంగా పరిశీలించింది. అనంతరం వచ్చిన దారినే బయటకు వెళ్లిపోయింది. ఆ సమయంలో రిసెప్షన్ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన దృష్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. మౌంట్ అబు ఎలుగుబంటి జనాభాకు ప్రసిద్ధి. ఈ ప్రాంతంలో దాదాపు 350 ఎలుగుబంట్లు ఉన్నాయి.
Also Read..
Monsoon Session | మూడో రోజూ దద్దరిల్లిన ఉభయసభలు.. ఎలాంటి చర్చా లేకుండానే రేపటికి వాయిదా