న్యూఢిల్లీ, జనవరి 3: దేశాన్ని దోచుకుంటున్న ప్రతి అవినీతి నేత తాము చేసిన తప్పులకు శిక్ష అనుభవించక తప్పదని, అవినీతికి పాల్పడితే కేజ్రీవాల్ అయినా, సొరేన్ అయినా ఊచలు లెక్కించాల్సిందేనని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా బుధవారం స్పష్టం చేశారు. కేజ్రీవాల్, సొరేన్ ఈడీ విచారణకు హాజరుకాకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. రాజకీయ ప్రేరేపితంగా తనకు ఈడీ నోటీసులు జారీ చేస్తున్నట్టు ఆరోపిస్తున్న కేజ్రీవాల్ ఈ విషయంలో ఎందుకు న్యాయస్థానాలను ఆశ్రయించడం లేదని ప్రశ్నించారు.