BCCI : భారత్ – పాకిస్థాన్ (India – Pakistan) దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత ఉధృతమయ్యాయి. ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) లో భాగంగా భారత్ ఈ తెల్లవారుజామున పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులకు పాల్పడింది. క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో దాదాపు 80 మంది ఉగ్రవాదులు (Terrorists) హతమైనట్లు సమాచారం. రెండు దేశాల మధ్య ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా ఆపరేషన్ సింధూర్‌తో ఆ ఉద్రిక్తతలు మరింత ఉధృతమయ్యాయి.
ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2025 సీజన్ కొనసాగుతుందా.. ఆగిపోతుందా.. అనే చర్చ మొదలైంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ 2025 సీజన్ ఈ నెల 25 వరకు కొనసాగనుంది. అయితే ఇప్పుడు ఇరు దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. దాంతో ఐపీఎల్ ఆగిపోతుందనే ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) వర్గాలు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చాయి. భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతలవల్ల ఐపీఎల్ 2025 సీజన్‌కు ఎలాంటి ఆటంకం ఉండబోదని, ఎప్పటిలాగే యథావిధిగా సీజన్ కొనసాగుతుందని తెలిపాయి. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సైన్యం ఇవాళ పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపుదాడులు చేసింది.