న్యూఢిల్లీ, జూలై 9: విద్యుత్తు వాహనాల్లో అగ్ని ప్రమాదాలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో ‘బ్యాటరీ పాస్‌పోర్ట్’ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నది. విద్యుత్తు వాహనాల్లో ఉపయోగించే బ్యాటరీలకు సంబంధించిన డిజిటల్ సమాచారంతో కూడిన పాస్‌పోర్ట్‌ను యజమానులకు అందించనున్నారు. బ్యాటరీ ఎక్కడ ఉత్పత్తయ్యింది, దాని కూర్పు, పనితీరు, ఎంతకాలం మన్నుతుంది, దాని సరఫరాదారు తదితర వివరాలను ఒక క్యూఆర్ కోడ్‌లో నిక్షిప్తం చేయనున్నారు. .
ఐఎస్ఎస్లో రైతుగా మారిన శుభాన్షు
న్యూఢిల్లీ: భారతీయ వ్యోమగామి శుభాన్షు శుక్లా రోదసీ రైతుగా మారిపోయారు. మెంతులు, పెసల విత్తనాలను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో నాటి, పెంచుతున్నారు. విత్తనాలు మొలకెత్తడం, మొలకెత్తిన తొలినాళ్లలో మొక్కల పెరుగుదలపై అత్యల్ప గురుత్వాకర్షణ స్థితి ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడం కోసం ఈ ప్రయోగాన్ని నిర్వహిస్తున్నారు. మరింత విస్తృతంగా పరిశోధన చేయడం కోసం ఈ మొలకెత్తిన విత్తనాలను స్టోరేజ్ ఫ్రీజర్‌లో పెట్టడానికి ముందు ఈ ప్రక్రియను ఆయన ఫొటోలతో సహా నమోదు చేశారు.