చండీఘడ్: సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ప్రధాని మోదీ(PM Modi) కాన్వాయ్‌ను పంజాబ్‌లో రైతులు అడ్డుకున్న విషయం తెలిసిందే. సుమారు 20 నిమిషాల పాటు మోదీ కాన్వాయ్ గత ఏడాది జనవరి 5వ తేదీన ఫిరోజ్‌పుర్ రహదారిపై నిలిచిపోయింది. ఆ కేసులో పంజాబ్ ఎస్పీపై వేటు పడింది. ఎస్పీ గుర్బిందర్ సింగ్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. బఠిండా ఎస్పీగా ఉన్న గుర్బిందర్ను సస్పెండ్ చేశారు.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రచారం నిమిత్తం ప్రధాని మోదీ జనవరి 5, 2022న ఫిరోజ్‌పూర్ వెళ్లాల్సి ఉంది. హుస్సేన్‌వాలాలో జరగనున్న సభలో ఆయన పాల్గొనేందుకు వెళ్లారు. కానీ రైతు ఉద్యమకారులు ప్రధాని మోదీ కాన్వాయ్‌కు అడ్డుతగిలారు. దీంతో ఓ ఫ్లైఓవర్‌పై మోదీ వాహనశ్రేణి నిలిచిపోయింది. రైతులు వెనక్కి తగ్గకపోవడంతో.. మోదీ కాన్వాయ్ వెనక్కి వెళ్లిపోయింది.