లక్నో: హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట ఘటన మరువకముందే, మరో ఘటన ఉత్తరప్రదేశ్లోని బారాబంకీలో చోటుచేసుకుంది. సోమవారం ఇక్కడి ఆసనేశ్వర్ మహదేవ్ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 29 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
తెల్లవారుజామున గర్భగుడిలో జలాభిషేకం జరుగుతుండగా తొక్కిసలాట ఘటన చోటుచేసుకున్నది. భక్తుల్లో కొంతమందికి విద్యుత్ షాక్ తగిలిందని, దీంతో అందరూ హాహాకారాలు చేస్తూ పరుగెత్తడంతో తొక్కిసలాటకు దారి తీసిందని స్థానికులు కొంతమంది చెప్పారు.