Banks Holidays in December | డిసెంబర్ చివరి వారం బ్యాంకులకు సెలవులే సెలవులు.. 8 రోజుల్లో 6 సెలవులు
Banks Holidays in December | త్వరలోనే అతి పెద్ద పండుగ క్రిస్మస్ రాబోతోంది. ఈ పండుగను ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్లు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అందులోనూ న్యూఇయర్ వేడుకలు కూడా
Banks Holidays in December | న్యూఇయర్ త్వరలోనే రాబోతోంది. ఇంకా 10 రోజులు అంతే. కొత్త సంవత్సరానికి అందరం స్వాగతం పలకబోతున్నాం. ఇప్పటి నుంచే అందరూ కొత్త సంవత్సరం కోసం ఎదురు చూస్తున్నారు. మరో విషయం ఏంటంటే.. డిసెంబర్ 24 నుంచి ఈ సంవత్సరం పూర్తయ్యే వరకు.. అంటే డిసెంబర్ చివరి వారం మొత్తం బ్యాంకులకు సెలవులే సెలవులు రానున్నాయి.

త్వరలోనే అతి పెద్ద పండుగ క్రిస్మస్ రాబోతోంది. ఈ పండుగను ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్లు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అందులోనూ న్యూఇయర్ వేడుకలు కూడా ఉండటంతో బ్యాంకులకు వరుసగా సెలవులు రానున్నాయి.
Banks Holidays in December | డిసెంబర్ 24 నుంచి 31 లోపు రెండే పనిదినాలు
డిసెంబర్ 24 నుంచి డిసెంబర్ 31 లోపు.. కేవలం రెండు పనిదినాలు మాత్రమే ఉన్నాయి. డిసెంబర్ 28, 29న తప్పించి మిగితా రోజుల్లో ఏదో ఒక రాష్ట్రంలో బ్యాంకులకు సెలవు ఉండనుంది. డిసెంబర్ 24న నార్త్ ఈస్ట్ ప్రాంతాలు ఐజ్వాల్, షిల్లాంగ్‌లో క్రిస్మస్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తారు. దాన్ని క్రిస్మస్ ఈవ్ అంటారు. ఆరోజు అక్కడ బ్యాంకులకు హాలీడే ఉంటుంది.
డిసెంబర్ 25న దేశ వ్యాప్తంగా క్రిస్మస్ సందర్భంగా అన్ని బ్యాంకులు ఆరోజు పనిచేయవు(నాలుగో శనివారం). డిసెంబర్ 26న ఆదివారం, డిసెంబర్ 27న కూడా ఐజ్వాల్‌లో క్రిస్మస్ సెలబ్రేషన్స్, డిసెంబర్ 30న షిల్లాంగ్‌లో యూ కియాంగ్ నాంగ్‌బా సందర్భంగా సెలవు, డిసెంబర్ 31న ఐజ్వాల్‌లో కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా సెలవును ప్రకటించారు. అంటే డిసెంబర్ 24 నుంచి ఇయర్ ఎండ్ వరకు ఉన్న 8 రోజుల్లో 6 రోజులు వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులే ఉండనున్నాయి. బ్యాంకు సెలవుల ఈ లిస్ట్‌ను ఆర్బీఐ తాజాగా విడుదల చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Omicron effect : వర్క్ ఫ్రం హోమ్ పొడిగించే ఆలోచనలో టీసీఎస్, హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్!
దేశీయ స్టాక్ మార్కెట్లకు బ్లాక్ మండే.. భారీగా నష్టపోయిన సూచీలు
Tata Tiago : జనవరిలో టాటా టియాగో సీఎన్జీ ఇండియా లాంఛ్
ప్రపంచ కుబేరుడి రికార్డు రాబడి : ఈ ఏడాది ఎలన్ మస్క్ ఎంత పన్ను చెల్లిస్తాడంటే..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

