ప్రపంచ కుబేరుడి రికార్డు రాబడి : ఈ ఏడాది ఎలన్ మస్క్ ఎంత పన్ను చెల్లిస్తాడంటే..!

న్యూయార్క్ : ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ సక్రమంగా పన్నులు చెల్లించడం లేదని వెల్లువెత్తిన ఆరోపణల నేపధ్యంలో ట్విట్టర్ వేదికగా కీలక వివరాలు వెల్లడించాడు. టెస్లా, స్పేస్ఎక్స్ సహా పలు ఇతర వెంచర్ల ద్వారా ఆయన ఆర్జిస్తున్న రాబడులకు తగినంతగా పన్ను చెల్లించడం లేదనే విమర్శలకు ట్వీట్ ద్వారా చెక్ పెట్టాడు. ఈ ఏడాది తన రాబడులపై ఎంత పన్ను చెల్లించనున్నదీ మస్క్ వెల్లడించాడు.
ఈ ఏడాది తాను దాదాపు రూ 83,624 కోట్లు పన్నుల కింద చెల్లిస్తానని టెస్లా, స్పేస్ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్ తెలిపాడు. ఇది నిజమైతే అమెరికన్ ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్‌కు ఇప్పటివరకూ సమకూరిన భారీ ట్యాక్స్ ఫైలింగ్ ఇదే కానుంది. తాను పన్నులు చెల్లించడం లేదని మొత్తకుంటున్నవారికోసం ఈ వివరాలు వెల్లడిస్తున్నానని మస్క్ పేర్కొంటూ ఈ ఏడాది తాను 1100 కోట్ల (రూ 83,624 కోట్లు) డాలర్ల పన్ను చెల్లిస్తానని ట్విట్టర్లో చెప్పుకొచ్చాడు.
మస్క్ సరైన రీతిలో పన్నులు చెల్లించడం లేదని టెక్ బిలియనీర్, మసాచుసెట్స్ సెనేటర్ ఎలిజబెత్ వారెన్ చేసిన విమర్శలపై టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత స్పందిస్తూ చరిత్రలో ఏ అమెరికన్ చెల్లించని రీతిలో ఈ ఏడాది అత్యధిక పన్నులను తాను చెల్లిస్తానని బదులిచ్చాడు. కాగా, ఎలన్ మస్క్‌కు టైమ్ మ్యాగజైన్ ఇటీవల పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2021 టైటిల్ కట్టబెట్టిన సంగతి తెలిసిందే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

