లక్నో: ప్రైవేట్ బ్యాంకులో పని చేసే మహిళా ఉద్యోగిని విధులు నిర్వహిస్తూ కుప్పకూలి మరణించింది. (Bank staffer dies in office) ఆమె గుండెపోటుతో చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. అయితే అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. వజీర్ గంజ్ ప్రాంతంలో నివసించే 45 ఏళ్ల సదాఫ్ ఫాతిమా లక్నోలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విభూతి ఖండ్ శాఖలో పని చేస్తున్నది. మధ్యాహ్నం భోజనం చేసేందుకు వెళ్లిన ఆమె ఒక్కసారిగా స్పృహతప్పి నేలపై కుప్పకూలి మరణించింది. పని ఒత్తిడి కారణంగా గుండెపోటు వల్ల ఆమె మరణించినట్లు బ్యాంకు సిబ్బంది అనుమానం వ్యక్తం చేశారు. ఫాతిమా మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పోలీసులు తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు, లోక్‌సభ ఎంపీ అఖిలేష్ యాదవ్ ఈ సంఘటనపై స్పందించారు. బ్యాంకు ఉద్యోగిని మరణంపై ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక ఒత్తిడికి ఇది నిదర్శనమని విమర్శించారు. బీజేపీ విఫల ఆర్థిక విధానాలు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల్లో పని ఒత్తిడికి కారణమని ఎక్స్ పోస్ట్‌లో ఆరోపించారు. ఇలాంటి ఆకస్మిక మరణాలకు బీజేపీ ప్రభుత్వం ఎంత బాధ్యత వహిస్తుందో, ప్రజలను మానసికంగా కుంగ దీసే బీజేపీ నేతల ప్రకటనలకూ అంతే బాధ్యత అని పరోక్షంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు.
लखनऊ में काम के दबाव और तनाव के कारण एचडीएफ़सी की एक महिलाकर्मी की ऑफिस में ही, कुर्सी से गिरकर, मृत्यु का समाचार बेहद चिंतनीय है।
ऐसे समाचार देश में वर्तमान अर्थव्यवस्था के दबाव के प्रतीक हैं। इस संदर्भ में सभी कंपनियों और सरकारी विभागों तक को गंभीरता से सोचना होगा। ये देश के… pic.twitter.com/Xj49E01MSs
— Akhilesh Yadav (@yadavakhilesh) September 24, 2024