Bank Manager | కోజీకోడ్, ఆగస్టు 16: తాకట్టు పెట్టిన 25 కిలోల బంగారంతో బ్యాంక్ మేనేజర్ పరారైన ఘటన కేరళలో జరిగింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వడకర బ్రాంచిలో సుమారు 17 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని బ్యాంక్ మేనేజర్ మధు జయకుమార్ అపహరించాడు. ప్రస్తుత మేనేజర్ ఇర్షాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వడకర పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
మధు జయకర్ 2023 జూన్ నుంచి 2024 జూన్ వరకు మేనేజర్‌గా పనిచేసి కొచ్చి బ్రాంచికి బదిలీ అయ్యారు. అయితే అతను ఆ బ్రాంచిలో జాయిన్ కాలేదు. తాకట్టులో ఉన్న బంగారం స్థానంలో నకిలీ నగలు ఉన్నట్టు కొత్తగా వచ్చిన మేనేజర్ గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఉదయ్‌పూర్‌లో ఉద్రిక్తత
జైపూర్: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలను రాజేసింది. కత్తిపోట్లకు గురవడంతో ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని వెంటనే ఎంబీ హాస్పిటల్‌కు తరలించారు. ఈ వార్త బయటకు పొక్కడంతో ఈ దవాఖాన ఎదుట హిందూ సంస్థలు ధర్నా చేశాయి.