Sheikh Hasina | బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఈ నెల ఐదో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు మనదేశంలో అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ విషయాన్ని విదేశాంగ వ్యవహారాలశాఖ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. షేక్ హసీనా తన పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్దీప్ దన్కర్లతో భేటీ అవుతారు. ప్రధాని నరేంద్రమోదీతో ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్‌తోనూ సమావేశమవుతారు.
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తన పర్యటనలో అజ్మీర్ షరీఫ్‌ను కూడా సందర్శించనున్నారు. `బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాకతో చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు, పరస్పర విశ్వాసం, అవగాహన ఆధారంగా రెండు దేశాల మధ్య సంబంధాలు బహుముఖంగా బలోపేతం అవుతాయి` అని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్చి పేర్కొన్నారు. ఇంతకుముందు షేక్ హసీనా 2019 అక్టోబర్‌లో మనదేశంలో పర్యటించారు.