అక్రమ బంగ్లా వలసదారులను రాత్రిళ్లు వారి దేశంలోకి నెట్టేస్తాం
చట్ట విరుద్ధంగా అస్సాంలో ఉంటున్న బంగ్లా దేశీయులను రాత్రి వేళ బలవంతంగా వారి దేశంలోకి నెట్టేస్తామని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ గురువారం ఆగ్రహం వ్యక్తం చేసింది.
- అస్సాం సీఎం వ్యాఖ్యలపై బంగ్లా ఆగ్రహం
- ఢాకాలోని భారత హైకమిషనర్‌కు సమన్లు
న్యూఢిల్లీ: చట్ట విరుద్ధంగా అస్సాంలో ఉంటున్న బంగ్లా దేశీయులను రాత్రి వేళ బలవంతంగా వారి దేశంలోకి నెట్టేస్తామని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ గురువారం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై ఢాకాలోని భారత హైకమిషనర్‌కు సమన్లు జారీ చేసి నిరసన వ్యక్తం చేసింది. ఇటీవల అస్సాం ఎన్నికల ప్రచారంలో అక్రమ వలసదారుల అంశాన్ని బీజేపీ ఎన్నికల ప్రచారానికి బాగా వాడుకొన్నది. ఈ నేపథ్యంలో ఏబీపీ ఇంటర్వ్యూలో హిమంత మాట్లాడుతూ… ‘వాళ్లను విదేశాంగ శాఖ ద్వారా అధికారికంగా వెనక్కి పంపాలి.
ఆ జాబితాలో ఎంతమందిని తమ దేశస్తులుగుర్తించి అనుమతించాలనే విషయంలో బంగ్లాదేశ్‌కే అధికారం ఉంటుంది. అందుకే ఈ మధ్య అక్రమ బంగ్లాదేశ్ వలసదారులను రాత్రి వేళ బంగ్లాదేశ్ సరిహద్దు దళం లేని చోట వారి దేశంలోకి తోసేస్తున్నాం’ అని అన్నారు. నిరుడు సుప్రీం కోర్ట్ అక్రమ వలసదారుల తరలింపు విషయంలో జిల్లా మెజిస్ట్రేట్లకు పూర్తి అధికారాలు ఇచ్చిందని.. ఒక వ్యక్తి భారతీయుడు కాదని వాళ్లు భావిస్తే తరలించ వచ్చని తెలిపిందని హిమంత తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

