న్యూఢిల్లీ, జూలై 2: పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ వార్తా, ఎంటర్టైన్మెంట్ చానళ్లు, సెలబ్రిటీల సామాజిక మాధ్యమ ఖాతాలపై విధించిన నిషేధాన్ని కేంద్రం ఎత్తివేసింది! బుధవారం నుంచి పాక్ చానళ్లు యథావిధిగా పనిచేస్తున్నాయి.
దీనిపై ప్రభుత్వం అధికారికంగా ప్రకటించక పోయినప్పటికీ, వీటి ప్రసారాలు యథావిధిగా కొనసాగుతుండటాన్ని చూస్తే వీటిపై ఆంక్షలు ఎత్తివేశారేమోనని ప్రచారం జరుగుతున్నది. దాడి తర్వాత నిషేధం విధించిన పాక్కు చెందిన సబా మమర్, మావ్రాఖూకేన్, హద్ ..తదితరుల అకౌంట్లను బుధవారం నుంచి పునరుద్ధరించారు.