రగులుతున్న బలూచిస్థాన్
బలూచిస్థాన్‌లో పెరిగిపోతున్న హింస పాకిస్థాన్‌లోని తాజా పరిస్థితిని ప్రతిబింబిస్తూ భద్రతా సంక్షోభాన్ని సృష్టిస్తున్నది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) తన ఆపరేషన్ హెరోఫ్ ద్వారా సైన్యంపై దాడులు తీవ్రతరం చేస్తూ పాక్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నది.
- పాక్ సైన్యంపై బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఆపరేషన్ హెరోఫ్ దాడులు
- 200 మంది పాక్ జవాన్లు మృతి
- పాక్ సైన్యం ఆపరేషన్‌లో 177 మంది తీవ్రవాదులు మృతి
న్యూఢిల్లీ: బలూచిస్థాన్‌లో పెరిగిపోతున్న హింస పాకిస్థాన్‌లోని తాజా పరిస్థితిని ప్రతిబింబిస్తూ భద్రతా సంక్షోభాన్ని సృష్టిస్తున్నది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) తన ఆపరేషన్ హెరోఫ్ ద్వారా సైన్యంపై దాడులు తీవ్రతరం చేస్తూ పాక్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నది. ప్రధాన పట్టణాల నుంచి మారుమూల గ్రామాల వరకు బీఎల్ఏ తన ఆపరేషన్ హెరోఫ్ 2.0 దశలో భాగంగా ఆత్మాహుతి దాడులు, కాల్పుల పోరుతో బీభత్సం సృష్టిస్తున్నది.
డజన్ల సంఖ్యలో పౌరులు, భద్రతా సిబ్బంది మరణించారని, గతంలో ఎన్నడూ లేని స్థాయిలో తీవ్రవాదుల అణచివేత ఆపరేషన్ జరుగుతున్నదని పాకిస్థానీ అధికారులు చెబుతున్నారు. గడచిన 48 గంటల్లో 177 మంది తీవ్రవాదులను మట్టుపెట్టినట్లు వారు తెలిపారు. అయితే బీఎల్ఏ ఈ వాదనను తోసిపుచ్చింది. తాము జరిపిన దాడుల్లో సుమారు 200 మంది పాక్ సైనికులు మరణించినట్లు తెలిపింది.
వనరులను కొల్లగొడుతున్నందుకే..
బలూచిస్థాన్ తిరుగుబాటు పాక్ ప్రభుత్వానికి భద్రతాపరంగా, ఆర్థికంగా, విదేశాంగ విధానం పరంగా తలనొప్పిగా మారింది. గ్వదర్ పోర్టు ద్వారా బెల్ట్ అండ్ రోడ్డు ప్రాజెక్టు చేపట్టాలని ఆశిస్తున్న చైనాకు బలూచిస్థాన్ ప్రావిన్సు ప్రతిబంధకంగా మారింది. రేకో డిఖ్ వద్ద అపార ఖనిజ నిక్షేపాలు ఉన్న బలూచ్, ఇరాన్, అప్ఘానిస్థాన్‌కు సరిహద్దున ఉండడంతో భద్రతాపరంగా పాక్‌కు కీలకంగా మారింది. బలూచ్‌లో తాజాగా జరిగిన మహిళా ఆత్మాహుతి బాంబర్ల దాడులు పాకిస్థాన్‌కు చెందిన విలువైన ఖనిజ నిక్షేపాల్లో పెట్టుబడి పెట్టాలని ఆసక్తిగా ఉన్న వారందరికీ హెచ్చరిక లాంటిదని రాజకీయ విశ్లేషకుడు మైఖేల్ కుగెల్మాన్ వ్యాఖ్యానించారు.
ఖనిజ నిక్షేపాలు ఉన్న ప్రాంతంలోనే ప్రస్తుతం హింస ప్రజ్వరిల్లిందని, స్థానిక వనరులను వెలుపలి శక్తులు దోచుకుంటున్నాయనే కోపమే బలూచ్ పౌరుల తిరుగుబాటుకు ప్రధాన కారణమని ఆయన తెలిపారు. మొట్టమొదటిసారి పురుషులతోపాటు మహిళలు కూడా బీఎల్ఏ పోరాటంలో భాగస్వాములయ్యారు. 800 నుంచి 1,000 మంది మహిళలు ఈ పోరాటంలో ఉండవచ్చని, వారికి నెలల తరబడి శిక్షణ ఇచ్చి ఉంటారని ఓ నిఘా అధికారి తెలిపారు. పాకిస్థాన్ ఈ తిరుగుబాటును కేవలం భద్రతాపరంగా మాత్రమే చూడడం లేదు. బీజింగ్‌తో సంబంధాలు, పెట్టుబడిదారుల విశ్వాసం వంటి వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని బలూచ్ తీవ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని భావిస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singareni Scam | సింగరేణిలో.. స్కాం గ్రెస్.. రూ.1,600 కోట్ల బొగ్గు ఏమైంది?
RIMS Fire Accident | ఐదుగురు పసికందుల మృతికి ఎలుకలే కారణమట.. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై 50 పేజీల నివేదిక
కరువు దెబ్బకు కండ్లు తెరిచిన సర్కార్.. పాలమూరు-రంగారెడ్డి పంపులు ఆన్ చేసేందుకు సన్నాహాలు
Badangpet | బడంగ్‌పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

