న్యూఢిల్లీ: తీవ్ర విషాదాన్ని నింపిన ఒడిశా రైలు ప్రమాద ఘటనలో తొలి అరెస్టు జరిగింది. రైల్వేకు చెందిన ముగ్గురు ఉద్యోగులను సీబీఐ అరెస్టు చేసింది. అరెస్టు అయిన వారిలో సీనియర్ సెక్షన్ ఇంజినీర్ (సిగ్నల్) అరుణ్‌కుమార్, సెక్షన్ ఇంజినీర్ మహమ్మద్ అమీర్‌ఖాన్, టెక్నీషియన్ పప్పుకుమార్ ఉన్నారు. వీరంతా బాలాసోర్‌లోనే విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రమాదానికి ఈ ముగ్గురు కారణంగా భావిస్తున్నామని సీబీఐ చెప్పినప్పటికీ ఏ తప్పు చేశారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. జూన్ 2న బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో 293 మంది మరణించిన విషయం తెలిసిందే.