చమోలీ: ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ క్షేత్రం ఓం నమో నారాయణాయ అష్టాక్షరీ మంత్ర స్మరణతో మార్మోగింది. వేద మత్రోచ్ఛారణలు, వాయిద్యాలు నడుమ ఆలయ ద్వారాలు ఆదివారం ఉదయం తెరచుకున్నాయి. దీంతో శ్రీమహావిష్ణువును దర్శించుకునేందుకు తరలివచ్చిన అశేష భక్తజనులు పులకించిపోయారు. చార్ధామ్ యాత్రలో భాగంగా ఇప్పటికే కేదార్నాథ్ ఆలయాన్ని తెరచిన విషయం తెలిసిందే. తొలిరోజు 30 వేల మందికిపైగా భక్తులు దర్శించుకున్నారు.
#WATCH | Uttarakhand: The portals of Badrinath Dham opened amid melodious tunes of the Army band and chants of Jai Badri Vishal by the devotees pic.twitter.com/BHzt7gWx4V
— ANI (@ANI) May 4, 2025
కాగా, జై బద్రీనాథ్ విశాల్ అంటూ లక్షలాది మంది భక్తుల జపిస్తుండగా.. గర్వాల్ రైఫిల్స్‌కు చెందిన ఇండియన్ ఆర్మీ భక్తి సంగీతాన్ని వాయిస్తుండగా ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. తొలుత ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామీ దేవాలయంలోకి ప్రవేశించి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చార్ధామ్ యాత్ర సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. భక్తుల ర భారీగా భద్రతా దళాలను మోహరించినట్లు చెప్పారు.
#WATCH | Uttarakhand: Flower petals being showered on the devotees as portals of Shri Badrinath Dham opened for the devotees today. pic.twitter.com/N4pbh1nmlP
— ANI (@ANI) May 4, 2025
40 క్వింటాళ్ల పూలతో ఆలయాన్ని అందంగా అలంకరించారు. ప్రత్యేక హెలికాఫ్టర్ ద్వారా దేవాలయ పరిసర ప్రాంతాల్లోని భక్తులపై పూల వర్షం కురిపించారు. ఉదయం 4.30 నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. గత శీతాకాలంలో ఆలయాన్ని మూసివేశారు. మళ్లీ 6 నెలల తర్వాత తిరిగి దేవాలయ తలుపులు తెచరుకున్నాయి. ఈ ఏడాది నవంబర్ వరకు ఆలయం తెరిచే ఉంటుంది.