న్యూఢిల్లీ : పిల్లల్ని తల్లులు కంటికి రెప్పలా ఎలా చూసుకుంటారో అలాగే తల్లుల పట్ల పిల్లలూ ప్రేమ కనబరుస్తుంటారు. తల్లి కోసం ఏం చేసేందుకైనా పిల్లలు (Viral Video) వెనుకాడరు. ఈ ధోరణి కేవలం మనుషుల్లోనే కాదు జంతువులూ ఇదే రకంగా వ్యవహరిస్తాయి. ఇక లేటెస్ట్ వీడియోలో ఘర్షణ జరుగుతుండగా తల్లిని కాపాడుకునేందుకు బేబీ గొరిల్లా చూపిన చొరవ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
Tiny baby Gorilla jumps right in the middle of a fight to protect his mom
by u/Ainsley-Sorsby in AnimalsBeingBros
రెడిట్‌లో షేర్ చేసిన ఈ వీడియోను పెద్దసంఖ్యలో వ్యూస్ లభించాయి. ఈ వీడియోలో రెండు గొరిల్లాలు తలపడగా బేబీ గొరిల్లా గమనించి వెంటనే తల్లిని కాపాడుకునేందుకు రంగంలోకి దూకడం కనిపిస్తుంది. ఆపై పిల్ల గొరిల్లాను పైకి ఎక్కించుకుని తల్లి మరో గొరిల్లా వెంటపడటం చూడొచ్చు. తల్లిని కాపాడుకునేందుకు బేబీ గొరిల్లా ఫైట్‌లోకి జంప్ చేసిందని ఓ యూజర్ కామెంట్ చేయగా, బేబీ గొరిల్లా చొరవను పలువురు యూజర్లు ప్రశంసించారు.
Read More
Odisha Train Accident | ఒడిశా రైలు ప్రమాద ఘటన.. ఇంకా 101 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది