Baba Siddique : శనివారం రాత్రి కిరాయి హంతకుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన ఎన్సీపీ నేత (NCP leader), మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ (Baba Siddique) మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయ్యింది. దాంతో బాంద్రాలోని సిద్ధిఖీ నివాసానికి ఆయన మృతదేహాన్ని తరలించారు. ఇవాళ రాత్రి 8.30 గంటలకు ముంబై లైన్స్‌లోని బడా ఖబ్రస్థాన్‌లో సిద్ధిఖీ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సిద్ధిఖీ అంత్యక్రియలను పూర్తిగా ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్లు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) ప్రకటించారు.
బాబా సిద్ధిఖీ బాంద్రాలో తన కుమారుడి కార్యాలయంలో ఉండగా గుర్తు తెలియని ముగ్గురు దుండగులు కాల్పులు జరిపి పారిపోయారు. అప్రమత్తమైన ఆయన భద్రతా సిబ్బంది, కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సిద్ధిఖీ కన్నుమూశారు. అయితే కాల్పులకు పాల్పడ్డ వారిలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సిద్దిఖీ 1999, 2004, 2009 ఎన్నికల్లో బాంద్రా వెస్ట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004, 2009లో రాష్ట్ర మంత్రి వర్గంలో ఆయనకు చోటు లభించింది. ప్రజా సేవ చేయడంతోపాటు గ్రాండ్‌గా పార్టీలు నిర్వహిస్తారనే పేరు సిద్ధిఖీకి ఉంది. 2013లో సిద్ధిఖీ నిర్వహించిన ఇఫ్తార్ విందులో బాలీవుడ్ స్టార్స్ షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు. అప్పట్లో వారి మధ్య విబేధాలు ఉండేవట. ఈ పార్టీలోనే సిద్ధిఖీ ఆ ఇద్దరు స్టార్స్‌ను దగ్గరకు చేర్చి గొడవలకు పుల్‌స్టాప్ పెట్టించారట.
#WATCH | Mumbai | Mortal remains of Baba Siddique brought to his residence, in Bandra.
Today, at 8:30 PM, last rites will be performed with full state honours at Bada Qabrastan, in Mumbai lines pic.twitter.com/NT1uJd0J7O
— ANI (@ANI) October 13, 2024