Baba Ramdev | బాబా రాందేవ్ గతంలో పలు దఫాలు బాలీవుడ్, బాలీవుడ్ నటులు అమీర్‌ఖాన్, సల్మాన్‌ఖాన్‌లను లక్ష్యంగా చేసుకున్నారు. శనివారం మరోమారు వారిపై నోరు పారేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన రాందేవ్ బాబా మాట్లాడుతూ బాలీవుడ్‌పైనా, డ్రగ్స్ వాడకంపైనా దాడి చేశారు. పెద్ద సినిమా స్టార్లు డ్రగ్స్ తీసుకుంటారని ఆరోపించారు. డ్రగ్స్ మహమ్మారి గ్రిప్‌లో బాలీవుడ్ పరిశ్రమ చిక్కుకుందన్నారు.
షారూఖ్‌ఖాన్ కొడుకు ఆర్యన్‌ఖాన్ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడి జైలుకెళ్లి వచ్చాడని రాందేవ్ బాబా వ్యాఖ్యానించారు. ‘సల్మాన్కూడా డ్రగ్స్ తీసుకుంటారు. కానీ, అమీర్‌ఖాన్ డ్రగ్స్ తీసుకుంటారా? లేదా? అన్న సంగతి తెలియదన్నారు. యావత్ బాలీవుడ్ రంగం అంతా డ్రగ్స్ గ్రిప్‌లో చిక్కుకుందని ఆరోపించారు.
ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో గతేడాది అక్టోబర్‌లో షారూఖ్‌ఖాన్ తనయుడు ఆర్యన్‌ఖాన్ అరెస్ట్ అయ్యాడు. కానీ, ఎన్సీబీ క్లీన్చిట్ ఇవ్వడంతో ఆరు నెలల తర్వాత బయటకు వచ్చాక. గతేడాది అమీర్‌ఖాన్‌ను లక్ష్యంగా చేసుకుని రాందేవ్ బాబా ఆరోపణలు గుప్పించారు.