Blood Group | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారం, జీన్స్.. ఓ వ్యక్తి ఎన్నేండ్లు బతుకుతుతాడన్నది నిర్ణయిస్తాయనేది అందరూ నమ్ముతున్న సిద్ధాంతం! ఇవేగాకుండా బ్లడ్ గ్రూప్‌నకు, వృద్ధాప్యానికి సంబంధముందని తాజా అధ్యయనం ఒకటి అంచనావేసింది. ‘బీ-బ్లడ్ గ్రూప్’ వ్యక్తుల్లో దీర్ఘాయుష్షు కనిపిస్తున్నదని, నెమ్మదిగా వృద్ధాప్యం బారిన పడటానికి ‘బీ’-బ్లడ్ గ్రూప్ కారణమై ఉండవచ్చునని సైంటిస్టులు చెబుతున్నారు.
ఇతర బ్లడ్ గ్రూపులతో పోలిస్తే బీ బ్లడ్ గ్రూప్‌నకు వృద్ధాప్య నిరోధకత ఎక్కువగా ఉన్నదని ఈ అధ్యయనం తెలిపింది. కణజాలం పునరుత్పత్తి, సెల్యులార్ రిపేర్ వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేస్తుందని పేర్కొన్నది. అయితే వ్యాయామం, హెల్తీ డైట్, ఒత్తిడిని తగ్గించుకోవడం వంటి ప్రాథమిక సూత్రలు పాటించకపోతే ఇది సాధ్యం కాదని స్పష్టంచేసింది.