లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్‌లో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. అహ్రాలా పోలీస్‌స్టేషన్ పరిధిలోని మహుల్నగర్ పంచాయతీలో కల్తీ మద్యం సేవించి తొమ్మిది మంది మృతి చెందారు. మరో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ వార్త స్థానికంగా కలకలం సృష్టించింది. తొమ్మిది మంది వరకు మృతి చెందగా.. ఆగ్రహించిన గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు.
వివరాల్లోకి వెళితే.. మృతుల కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతులంతా మహుల్ పట్టణంలోని ఓ వైన్స్‌లో దుకాణంలో మద్యం కొనుగోలు చేశారు. అది తాగిన అనంతరం ఆరోగ్యం దెబ్బతిన్నది. ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఇప్పటి వరకు 9 మంది మృతి చెందినట్లు సమాచారం అందగా.. ఇంకా చాలా
మంది ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.
यूपी से बड़ी खबर… आजमगढ़ में जहरीली शराब पीने से 9 लोगों की मौत: 12 लोगों की हालत गंभीर, ग्रामीणों ने सड़क पर लगाया जाम, मौके पर पहुंचे जिले के आला अधिकारी https://t.co/yskz8rkAht pic.twitter.com/sVus6EM6kv
— आदित्य तिवारी / Aditya Tiwari (@aditytiwarilive) February 21, 2022