Ayodhya Ram Mandir | అయోధ్య, ఫిబ్రవరి 24: అయోధ్యలోని బాలరాముడి ఆలయానికి నెల వ్యవధిలో దాదాపు రూ.25 కోట్ల మేర విరాళాలు వచ్చాయి. ఇందులో 25 కేజీల బంగారం, వెండి ఆభరణాలు కూడా ఉన్నాయి.హుండీల్లో కానుకలతో పాటుగా చెక్కులు, డ్రాఫ్ట్లు, నగదును భక్తులు డిపాజిట్ చేశారని ట్రస్టు ఆఫీస్ ఇన్చార్జి ప్రకాశ్ గుప్తా తెలిపారు. అయితే నేరుగా ఆన్లైన్లో వచ్చిన విరాళాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియదన్నారు.