పీఎంవో అడిగినా సమాచారం ఇవ్వలేం… విరాళాల దుర్వినియోగంపై అయోధ్య ఆలయ ట్రస్ట్ సమాధానం
అయోధ్యలోని రామాలయానికి సమర్పించిన విరాళాల్లో కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) దర్యాప్తును కారణంగా చూపుతూ ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) కోరిన ఆర్థిక సమాచారాన్ని అందచేయడానికి శ్రీరామ జన్మభూమి ఆలయ తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిరాకరించింది.
లక్నో, జూన్ 25 : అయోధ్యలోని రామాలయానికి సమర్పించిన విరాళాల్లో కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) దర్యాప్తును కారణంగా చూపుతూ ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) కోరిన ఆర్థిక సమాచారాన్ని అందచేయడానికి శ్రీరామ జన్మభూమి ఆలయ తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిరాకరించింది. నిధుల దుర్వినియోగం ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని, విరాళాలు, భూమి కొనుగోళ్లు వంటి వివరాలను ప్రజలకు బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ సీనియర్ నాయకుడు రజనీష్ సింగ్ రాసిన లేఖపై స్పందించిన పీఎంవో తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ అయోధ్య జిల్లా పాలనా యంత్రాంగానికి ఆ లేఖను పంపింది.
అవసరమైన సమాచారాన్ని అందచేయాలని కోరుతూ ట్రస్ట్ కార్యవర్గ సభ్యులను జిల్లా యంత్రాంగం సంప్రదించగా ప్రస్తుత సిట్ దర్యాప్తును కారణంగా చూపుతూ సమాచారం అందచేయడానికి ట్రస్టు నిరాకరించినట్లు వర్గాలు తెలిపాయి. సిట్ దర్యాప్తు పూర్తయ్యేవరకు ఎటువంటి సమాచారాన్ని బహిర్గతం చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.
8 మందిపై ఎఫ్ఐఆర్..ఏడుగురు కస్టడీలోకి
రామ మందిరం విరాళాల దుర్వినియోగం కేసులో 8 మంది నిందితులతో పాటు పలువురు గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏడుగురు నిందితులను కస్టడీలోకి తీసుకోగా అనుకల్ప్ మిశ్రా అనే నిందితుడిని అరెస్టు చేశారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి లేదా సంస్థ ఉద్యోగి నేరపూరిత కుట్రలో భాగంగా ఉద్దేశపూర్వక దొంగతనం, అలవాటుగా చేసే దొంగతనం, దొంగతనానికి సహకరించడం, నేరపూరిత విశ్వాస ఘాతుకానికి పాల్పడటం వంటి నేరారోపణలు ఎఫ్ఐఆర్లో ఉన్నాయని పోలీసులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

