న్యూఢిల్లీ: ఒక పక్క దేశంలో జీ20 శిఖరాగ్ర సదస్సుతో యంత్రాంగం తలమునకలై ఉన్న సమయంలో అయోధ్య రామ మందిరానికి సంబంధించి కీలక సమాచారం తెలిసింది. యూపీలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అయోధ్య రామ మందిరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే ఏడాది జనవరి 22న ప్రారంభిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గత రెండేళ్ల నుంచి ఈ మందిర నిర్మాణ పనులు సాగుతున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధానితో పాటు ముఖ్యమైన కొందరు మంత్రులు పాల్గొంటారని ఆ వర్గాలు తెలిపాయి.