అయోధ్య: శ్రీరామ జన్మభూమిలో బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ తొలి వార్షికోత్సవం సందర్భంగా వచ్చే నెల 11 నుంచి మూడు రోజులపాటు సంబరాలు జరుగుతాయి. వీటికి హాజరయ్యే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చెప్పారు.
ప్రాణ ప్రతిష్ఠకు ఆహ్వానాలు అందని లేదా హాజరు కాలేకపోయిన సాధువులు, స్వామీజీలను ఈ కార్యక్రమాలకు ఆహ్వానిస్తామన్నారు. అంగద్ తిల వద్ద జరిగే కార్యక్రమాలకు సాధారణ భక్తులు హాజరుకావచ్చు. దేవాలయం ప్రాంగణంలో జరిగే వాటికి ఆహ్వానితులను మాత్రమే అనుమతిస్తారు.