అయోధ్య : అయోధ్య బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ వార్షికోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. యజుర్వేద పారాయణంతో బాలరాముని విగ్రహ ప్రతిష్ట వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు బాల రాముడికి మహాభిషేకం, సరయు నదీ జలాలతో అభిషేకం చేశారు. ఆలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ నెల 11 నుంచి 13 వరకు జరిగే ఉత్సవాల్లో ఆధ్మాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు రామ కథ పారాయణం నిర్వహించనున్నారు.