Ayodhya : ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) చేతుల మీదుగా రేపు (మంగళవారం) అయోధ్య (Ayodhya) లోని రామమందిరం (Ram Temple) లో ద్వజారోహణ (Dhwaja Arohan) కార్యక్రమం జరగనుంది. ఆలయ శిఖరంపై 22 అడుగుల కాషాయ జెండాను ఎగురవేయడం ద్వారా ద్వజారోహణ పూర్తవుతుంది. ఆలయ నిర్మాణం పూర్తయినందుకు సంకేతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.
ద్వజారోహణ కోసం ఆలయంలో ఏర్పాట్లన్నీ ముమ్మరంగా సాగుతున్నాయి. శ్రీ సీతారాముల కళ్యాణం జరిగిన మార్గశిర మాసం శుక్లపంచమి రోజున అభిజిత్ ముహూర్తముననే ఈ ద్వజారోహణ కార్యక్రమం జరుగుతుండటం విశేషం. అంతేకాదు 17వ శతాబ్దంలో అయోధ్యలో నిర్విరామంగా 48 గంటలపాటు ధ్యానం చేసిన సిక్కుల ఆరో గురువు తేజ్ బహదూర్ అమరత్వం పొందిన రోజు కూడా అదే కావడం గమనార్హం.
ధర్మంపై అధర్మం గెలుపునకు గుర్తుగా నాడు అయోధ్యలో ద్వజారోహణ జరిగిందని, ఆ క్రమంలోనే ఇప్పుడు ఆలయ పునర్నిర్మాణం పూర్తి చేసి ద్వజారోహణ కార్యక్రమం నిర్వహిస్తున్నారని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొన్నది. ద్వజారోహణ రోజు ఎగురవేసే కాషాయ జెండా గౌరవానికి, ఐక్యతకు, సంస్కృతి, సంప్రదాయాలకు కొనసాగింపునకు, రామరాజ్య పాలనా వైభవానికి నిదర్శనాలని ప్రకటించింది.