Ayodhya Bar Association: అయోధ్య బార్ అసోసియేషన్ కీలక నిర్ణయం.. నిందితుల తరపున వాదిస్తే 5 లక్షల ఫైన్
Ayodhya Bar Association: అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం కేసులో అయోధ్య బార్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకున్నది. నిందితుల తరపున కేసులను వాదించబోమని బార్ తీర్మానించింది. ఒకవేళ ఎవరైనా వాదిస్తే వారికి 5 లక్షల జరిమానా విధించనున్నారు.
అయోధ్య: అయోధ్య రామాలయంలో విరాళాలను దుర్వినియోగం చేసిన కేసులో 8 మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ అయోధ్య బార్ అసోసియేషన్(Ayodhya Bar Association) కీలక నిర్ణయం తీసుకున్నది. నిందితుల తరపున కేసును వాదించబోమని లాయర్ల సంఘం తీర్మానించింది. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాలికా ప్రసాద్ మిశ్రా మాట్లాడుతూ.. నిధుల చోరీ కేసులో నిందితులను తరపున ఎవరూ వాదించరు అని, ఒకవేళ వాదిస్తే వారికి 5 లక్షల జరిమానా విధించనున్నట్లు చెప్పారు. బార్ అసోసియేషన్ మరో నిర్ణయాన్ని కూడా తీసుకున్నది. రామాలయ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, సభ్యుడు అనిల్ మిశ్రా, గోపాల్ రావు.. తక్షణమే అయోధ్య విడిచి వెళ్లాలని డిమాండ్ చేసింది.
మూడు రోజుల్లోగా అయోధ్య నుంచి వెళ్లిపోకుంటే, అప్పుడు సిటీని బ్లాక్ చేస్తామని, ఎవర్నీ లొపలికి రానివ్వకుండా చేస్తామని మిశ్రా తెలిపారు. అయితే ఈ ముగ్గురిలో ఏ ఒక్కరి పేరు కూడా ఎఫ్ఐఆర్లో నమోదు కాకపోవడం గమనార్హం. ఈ కేసులోని 8 మంది నిందితుల్లో అవినాశ్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవ్ కుష్ మిశ్రా, మనీశ్ కుమార్ యాదవ్, కరుణేశ్ పాండే, రామ్ శంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాత్సవ, రామశంకర్ ఉన్నారు. నిందితులు అందరూ క్యాష్ కౌంటింగ్, విలువైన వస్తువులను భద్రత పరిచే ఉద్యోగంలో ఉన్నారు.
ఈ కేసులో సీబీఐ విచారణ చేపట్టాలని బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. సమగ్ర విచారణ కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్లనున్నట్లు ప్రసాద్ మిశ్రా తెలిపారు. చంపత్ రాయ్, అనిల్ మిశ్రా ప్రస్తుతం ట్రస్టుకు రాజీనామా చేశారు. దానిపై జూలై 7వ తేదీన నిర్ణయించనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్-వెస్టిండీస్ ఐదో టీ20 వర్షార్పణమేనా..?
AI | ఏఐపై అతిగా ఆధార పడుతున్న యువత.. మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుందని నిపుణుల హెచ్చరిక..
Help Desk | పట్టభద్రుల ఎన్రోల్మెంట్ హెల్ప్డెస్క్ ప్రారంభం
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

