న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ నుంచి తిరుగు ప్రయాణానికి శుభాన్షు శుక్లా బృందం సిద్మైంది. డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌కు ఆ వ్యోమగాములు చేరుకున్నారు. మరికొన్ని గంటల్లో ఐఎస్ఎస్ను ఆ స్పేస్‌క్రాఫ్ట్ వీడనున్నది. ఆ తర్వాత 23 గంటల్లోగా ఆ డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ భూమి మీదకు రానున్నది. ఆక్సియం-4 మిషన్‌లో భాగంగా భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా(Shubhanshu Shukla)తో పాటు మరో ముగ్గురు అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు.
అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారత వ్యోమగామిగా శుక్లా రికార్డు క్రియేట్ చేశాడు. గతంలో 1984లో రాకేశ్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. రిటర్న్ జర్నీలో భాగంగా కాలిఫోర్నియా తీరంలో డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ దిగనున్నది. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం ఆ స్పేస్‌క్రాఫ్ట్ నేలపై వాలుతుంది. తిరుగు ప్రయాణం నేపథ్యంలో ఆదివారం అంతరిక్ష కేంద్రంలో ఫేర్వెల్ సెర్మనీ జరిపారు.
శుభాన్షు శుక్లాతో పాటు కమాండర్ పెగ్గీ విట్సన్, మిషన్ స్పెలిస్ట్ స్లావోస్ ఉజన్స్కీ, తిబోర్ కాపు ఉన్నారు. ఫేర్వెల్ సందర్భంగా శుక్లా మాట్లాడుతూ.. త్వరలోనే భూమి మీద కలుసుకుందాం అని పేర్కొన్నాడు.
Live: Join us as the @Space_Station bids farewell to the @Axiom_Space #Ax4 crew. The crew is scheduled to enter the @SpaceX Dragon spacecraft at 4:55 a.m. EDT (0855 UTC), followed by hatch closure. https://t.co/ITbWeJBPGL
— NASA (@NASA) July 14, 2025