ముంబై : లఖింపూర్ ఖీరీ హింసాత్మక ఘటనలను నిరసిస్తూ మహారాష్ట్రలోని అధికార పక్షం ‘మహావికాస్ అఘాదీ’ (శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్) నేతృత్వంలో సోమవారం బంద్ కొనసాగిన విషయం విదితమే.
ఈ బంద్ సందర్భంగా శివసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. థానేలో రోడ్లపైకి వచ్చిన ఆటో డ్రైవర్లపై శివసేన కార్యకర్తలు కర్రలతో దాడి చేశారు. ఓ లీడరైతే ఏకంగా ఆటో డ్రైవర్ చెంప ఛెల్లుమనిపించాడు. ఆటోలను ఆపాలని కొందరు అరిచారు. శివసేన కార్యకర్తల దాడులతో ఆటో డ్రైవర్లు భయపడ్డారు. ఇక బంద్ నేపథ్యంలో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి.
महाराष्ट्र बंद : ठाण्यात बंदच्या काळात रस्त्यांवर उतरलेल्या रिक्क्षाचालकांवर शिवसैनिकांची दादागिरी. मार्केट रोडवर अनेकांना मारहाण#Maharashtraband #महाराष्ट्रबंद #लखीमपूर pic.twitter.com/4nNdKpVcza
— Mumbai Tak (@mumbaitak) October 11, 2021