సీఎన్జీ సబ్సిడీ ఇవ్వాలంటూ డిమాండ్
నేడు కూడా కొనసాగిస్తామని వెల్లడి
తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: సీఎన్జీ సబ్సిడీ ఇవ్వాలని, ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ట్యాక్సీ రేట్లు పెంచుకునే వీలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్ల యూనియన్లు సమ్మె చేపట్టాయి. మంగళవారం కూడా తమ సమ్మె కొనసాగిస్తామని యూనియన్ లీడర్లు స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. క్యాబ్, ఆటోల కోసం చాలాసేపు ఎదురు చూడాల్సి వచ్చిందని, ఎవరైనా వచ్చినా భారీగా రేట్లు పెంచారని పలువురు ప్రయాణికులు వాపోతున్నారు. వేరే రాష్ర్టాల నుంచి రైళ్లు, బస్సులు, వేరే మార్గాల ద్వారా ఢిల్లీకి చేరుకున్న వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.