అంబాలా: హర్యానాలోని అంబాలాలో స్థానిక జిల్లా యంత్రాంగం ఇవాళ కీలక ప్రకటన చేసింది. ఇవాళ రాత్రి నుంచి పూర్తిగా బ్లాకౌట్(Ambala Blackout) పాటించాలని ఆదేశించింది. ఇండోపాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో రాత్రి పూట బ్లాకౌట్ అమలు చేయనున్నారు. ప్రజల రక్షణ, వ్యూహాత్మక పరిస్థితుల నేపథ్యంలో రాత్రి పూట చీకటిగా ఉంటుందని డిప్యూటీ కమీషనర్ అజయ్ సింగ్ తోమర్ తెలిపారు. ఇన్వర్టర్లు, జనరేటర్లు, ఔట్డోరు లైట్లు, బిల్‌బోర్డులు, స్ట్రీట్ లైట్లుకు పవర్ బ్యాకప్ కూడా వాడరాదు. రాత్రి 8 నుంచి ఉదయం 6 గంటల వరకు బ్యాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఒకవేల ఇండోర్‌లో లైట్లు వాడాలనుకుంటే, డోర్లు.. విండోలను పూర్తిగా కవర్ చేసుకోవాలన్నారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై బీఎన్ఎస్ఎస్లోని సెక్షన్ 223 ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది.